– పల్లవి గ్రూప్ విద్యా సంస్థల చైర్మెన్ ముల్క కొమురయ్య
నవతెలంగాణ-బేగంపేట్
భారతీయసంస్కతి, సాంప్రదాయాలు నేటి తరా లకు తెలియజేయాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని పల్లవి గ్రూప్ విద్యా సంస్థల చైర్మెన్ ముల్క కొమురయ్య అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం అంజలీ థియేటర్‌లో విద్యార్థులకు కొమురయ్య ఆధ్వ ర్యంలో హనుమాన్ సినిమా ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి సినిమాను తిలకించిన అనం తరం ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టతో 500 సం వత్సరాల కల నెరవేరుతుందని, హనుమాన్ సినిమా సైతం ప్రజలను ఆకట్టుకుంటుందని ఆయ న అన్నారు. భారతీయ సంస్కతి, సాంప్రదాయా ల్లోని ఔన్నత్యాన్ని, అయోధ్య రామమందిర చరిత్ర చాటి చెప్పేలా తమవంతు కషి చేయడం జరుగుతుంద న్నారు. ఉడుతా భక్తిగా విద్యార్థులకు హనుమాన్ సిని మాను తిలకించేలా ఉచితంగా టికెట్లు అందించి విద్యా ర్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు కషి చేస్తున్నామ న్నారు. ప్రాశ్యాత్య దోరణులతో మన సాం ప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను మరచిపోతున్న తరుణంలో హను మాన్ లాంటి చిత్రాలు మరిన్ని రావా లని వాటిని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా థియేటర్ ప్రాంతంలో రామనామస్మరణలతో మారు మ్రో గాయి. జైహనుమాన్, జైశ్రీరామ్ అంటూ నినాదాలతో పాటు హనుమాన్ చాలీసాల పఠనం చేశారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ నాయకులు శ్రీగణేష్ తో పాటు స్కూలు విద్యార్థులతో కలిసి కొమురయ్య చిత్రాన్ని తిలకించారు. ప్రతి హిందువు ఈ చిత్రాన్ని చూడాలని ఆయన కోరారు.