అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు


నవతెలంగాణ -పెద్దవూర: పెద్దవూర మండల ప్రజలు సోమవారం సంక్రాతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపు కున్నారు.పులిచర్ల, పెద్దవూర, ఉట్లపల్లి, బట్టుగూడెం, బోనూతల, కుంకుడు చెట్టు తండ, పర్వేదుల, వెల్మగూడెం, గర్నెకుంట, నాయినవాని కుంట గ్రామాల్లోఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.చిన్నారులు గాలిపఠాలు ఎగురావేస్తూ కేరింతల నడుమ సంబరాలు చేసుకున్నారు.ఉదయాన్నే భోగి మంటలు వెలిగించడంతో సంబరాలను ఏర్పాటు చేసిన భోగి మంటలు, పండుగ వాతావరణంను తలపించేలా రంగ వల్లులు, చెరుకు గడల అలంకరణ, అతిధులకు సన్నాయి మేళాలతో స్వాగతం, గంగిరెద్దుల, డప్పు కళాకారుల విన్యాసాలు, కోడి పుంజుల ఆటలు, చిన్నారులకు భోగి పండ్లతో వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలు పండగ వాతావరణం తెచ్చింది.ప్రతి రైతు తన పంట చేతికి వచ్చిన సందర్భంగా ఆనందంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి ప్రముఖ మైనది.సంక్రాతి తెలుగు ప్రజల పండుగ సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాలలో జరిగే పండుగ శోభను సంతరించు కూన్నాయి.