ఘనంగా సంక్రాంతి సంబరాలు

నవతెలంగాణ మల్హర్ రావు: మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతలు వేగువ జామున లేచి ఇళ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి, అవుపేడతో గొబ్బెమ్మలు, నవ ధాన్యాలు, రేగుపళ్ళు, పూలు పెట్టి పూజలు నిర్వహించారు. పిల్లలకు బోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. ఆలయాల్లో చిన్న, పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు నోముకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటింటా పిండి వంటలు చేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏడాదిలో పన్నెండు సార్లు 12 రాసుల్లో సూర్యుడు సంక్రమణ జరుతుందని పూర్వీకులు చెబుతుంటారు. అలాగే సూర్యుడు ధన రాశి నుంచి మకర రాశిని ప్రవేశించే రోజును సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు.