అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం


నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయానికి గ్రామానికి చెందిన సింగిరెడ్డి జలపతి రెడ్డి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ. 50,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం విరాళం మొత్తాన్ని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులకు అందజేశారు.వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, బద్దం రాజేష్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింత గణేష్, సంత నడిపి రాజేశ్వర్, పార్శపు జైపాల్ తదితరులు పాల్గొన్నారు.