ఆది ధ్వని పరికరాలను తిలకించిన కోదండరాం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం బుధవారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావ్‌ సేకరించి భద్రపరిచిన ప్రాచీన కలల ఆది ధ్వని పరికరాలు, ప్రాచీన ఆదివాసీ సంప్రదాయ వస్తువులను తిలకించారు. ఆది ధ్వని వస్తువులు, పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.