ఎండుతున్న పల్లె ప్రకృతి వనం

నవతెలంగాణ జూలపల్లి: జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం లక్షలు వెచ్చించి, మొక్కలు నాటారు. కానీ మొక్కల పెంచేబాధ్యతలు మరిచారు. అనడానికి ఇదే నిదర్శనం. లక్షలు వెచ్చించి నాటారు. కానీ వాటి సంరక్షణ బాధ్యతను మరిచారు. అటుగా వెళుతున్న గ్రామస్తులు. ముక్కున వేలు వేసుకొని రాజుల సొమ్ము రాళ్లపాలు అనే చందంగా, ప్రజల సొమ్మును గంగపాలు చేశారని గ్రామస్తులు వాపోతున్నారు. పాలకవర్గం, పంచాయతీ కార్మికుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. తరచూ మొక్కలు నాటడమే కానీ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం లేదని, గత కొన్ని సంవత్సరాల నుండి చాలా మొక్కలు నాటారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా పాలకవర్గం పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకొని మిగిలి ఉన్న చెట్లను అయినా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.