అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆడపిల్లని మా ఇంటి మహాలక్ష్మిని, దేవతతో పోల్చుతారని చెప్పారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. నిత్యం వారిపై ఎదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటా,బయట అనేక ఆంక్షలు ఉంటాయని , ఆడపిల్లల జీవించే హక్కు మగపిల్లల జీవించే హక్కు లాగ గౌరవింపబడడంలేదన్నారు. చాలా దేశాల్లో అమ్మాయి పుట్టాలన్న కోరిక కంటే అబ్బాయి పుట్టాలన్న కోరిక ఎక్కువైయిందన్నారు. అమ్మాయి పుడుతుందని తెలిసినప్పుడు బృన హాత్యలకు పాల్పడుతున్నారన్నారు. అమ్మాయి లకి సురక్షితంగా ఉండే వాతవరణం ఉండి, చక్కని చదువు ఉండి, ఆరోగ్యకరమైన జీవితం గడపగలిగే అవకాశం ఉంటే వారు తల్లులుగా, వ్యాపార వేత్తలుగా, గృహిణులుగా, రాజకీయ నేతలుగా ఎదిగి దిశానిర్దేశం చేయగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుతారని, మనదేశంలో జనవరి24న జాతీయ బాలికల దినోత్సవం జరుపుతున్నారు. అంతర్జాతీయ, మహిళా దినోత్సవానికి ఇచ్చిన, ప్రాధాన్యత బాలికల,దినోత్సవానికి కూడా ఇవ్వాలని, ఆడపిల్లలు చదువుకోవడానికి ,ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య,ప్రధాన కార్యదర్శి శనిగల లక్ష్మన్,కార్యదర్శి బండి సుధాకర్ పాల్గొన్నా