ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి..

నవతెలంగాణ డిచ్ పల్లి :  డిచ్ పల్లి మండలంలోని  ధర్మారం (బి) గ్రామం లోని గ్రామ పంచాయతీ వద్ద ఉన్న అంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావ్  ఇంటికి వెళ్ళిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, తాహెర్ బీన్ హందన్, డిచ్ పల్లి  మండల కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, పోలసాని శ్రీనివాస్, శ్యాం సన్, కంచెట్టి గంగాధర్, విశ్వా ఆగ్రో టేక్ డైరెక్టర్ బైర సుభాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజార్ కిషన్ రావు, సర్పంచ్ పత్తి మమత అనంద్, నాగేశ్వర్ రావు, నాయుడు ఆంజనేయులు, వ్యవసాయ శాఖ అధికారులు,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.