బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని  గన్నారం గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు గత 15 రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేనందున అసుపత్రి కి వెళుతున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో తివ్ర గాయాలై జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొందిన గోవర్ధన్ కు గల్ఫ్ మిత్రులు, గన్నారం గ్రామంలో ఉన్న మిత్రులు తమ వంతుగా 67వెల750 రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం బాధితుడికి అందజేశారు. పందిన గోవర్ధన్ కు భార్య ఒక కూతురు ఉన్నారు.అయన ఆర్థిక పరిస్థితి బాగా లేనందున గల్ఫ్ మిత్రులు తమకు తోచిన సహాయం చేసి దానికి తోడుగా గన్నారం గ్రామానికి చెందిన వారు కూడా ముదిరాజ్ కులస్తులు కలిసి అందజేశారు.గల్ఫ్ లోని  దుబాయి, కువైట్, సౌదీ అరేబియా తో పాటు పలు దేశాలకు చెందిన మిత్రులు ఆర్థిక సహాయం చేయడం పాట్లా బాధిత కుటుంబ సభ్యులు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.గోవర్ధన్ త్వరగా కోలుకోవాలని వారు కోరారు.