నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : ఎన్నికలు జరిగి నెలరోజులు కూడా కాకముందు మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులుస్తాడన్న సమాచారం తన వద్ద ఉందని , తెలిసిన సమాచారాన్ని పోలీసులకు లేదా ప్రభుత్వానికి చెప్పకుండా బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని వెంటనే మాజీ ఎంపీ బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు పిసిసి మెంబర్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బంక చందు సిఐ ఎర్రల కిరణ్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ ,బిజెపి పార్టీలు ఒకటేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వెన్న రాజు , వల్లపు రాజు, నర్సాగౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.