”హను- మాన్’ చిత్రం కన్నుల పండగలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చిత్రాన్ని అద్భుతంగా తీశారు’ అని హీరో నందమూరి బాలకష్ణ అన్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్’. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని నందమూరి బాలకష్ణ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఇందులో అద్భుతమైన కంటెంట్ వుంది. ఇప్పుడున్న టెక్నిక్‌ని బ్రహ్మాండంగా వాడుకొని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. హను-మాన్ కన్నుల పండగలా ఉంది. శ్రీరాముడు, ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రేక్షకులకు అద్భతమైన చిత్రాన్ని అందించారు. సినిమా మేకింగ్‌లో చాలా ప్యాషన్ కనిపించింది. చిత్ర నిర్మాతని కూడా కెప్టెన్ అఫ్ ది షిప్ అనాలి. సినిమా తీయడానికి రెండున్నరేళ్ళు పట్టిందంటే మామూలు విషయం కాదు. ఇలా చేయాలంటే చాలా ప్యాషన్ కావాలి. అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు కనపరిచాయి. డైరెక్షన్, ఫోటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, మ్యూజిక్, నటీనటులు.. ఇలా అందరూ ఎక్స్ ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చేశారు. టీం అందరికీ అభినందనలు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శలు ప్రసంశలు అందుకొని బాక్సాఫీసు వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా కలెక్షన్లు మహేష్‌బాబు గుంటూరుకారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ చిత్రాలతో పోలిస్తే టెర్రిఫిక్‌గా ఉండటం విశేషం.