విద్యారంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి

విద్యారంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి– 317 జీవోతో నష్టపోయిన వారిని సొంత జిల్లాలకు పంపిస్తాం
– ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అన్నారు. 10 ఏండ్లు విద్యా వ్యవస్థకు పూర్తి నష్టం వాటిల్లిం దని దాన్ని సవరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉం దని విద్యాశాఖను ఎస్సీఆర్టినీ పూర్తి పక్షాన చేస్తామ ని, రాష్ట్రంలో 317 జీవోతో నష్టపో యిన ఉద్యోగ ఉపాధ్యాయులను వారిసొంత జిల్లాలకు పంపేం దుకు రాష్ట్రం యోచిస్తుందని అవసరమైతే జిల్లా లను శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని తాం డూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అన్నారు. బుధవా రం తాండూ రులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో టీఎస్‌ యూటీఎఫ్‌ తాండూర్‌ డివిజన్‌ క్యా లెండర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ..అసలు ప్రభుత్వం విద్యను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురిచేస్తూ గాలికి వదిలేసిందని, విద్య వ్యవస్థను గాడిలో పెట్టే ప్రక్రియను రాష్ట్రంలో కొత్త గా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రక్షాళన చేసే దిశగా పను లు ప్రారంభించిందన్నారు. రాబోయే 5,6 ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుపరిచే 317 జీవోను గత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులను చెట్టుకొక్కరి పుట్టకొకరికి విసివేసినట్లు చేసిందన్నారు. కుటుం బాలను చిందర వందర చేశాయని ఈ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌ యూ టీఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు మండలాధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ..విద్యాపరంగా జిల్లా పూర్తిగా నిరాదరణకు గురయిందని రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణ ప్రాంతా విద్యా సంస్థలకు చేయూ తనిచ్చి నిరుపేద బడుగు, బలహీన వర్గాల పిల్లల కు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎస్సీఈఆర్టీలో ఏళ్ల తరబ డిగా పాతుకుపోయిన ఉపాధ్యాయులను తమ సొంత పాఠశాలలకు పంపాలని ఎమ్మెల్యేను కోరా రు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము లు ఉపాధ్యక్షులు నర్సింలు, తాండూర్‌ మండలా ధ్యక్షులు నారాయణ గౌడ్‌, వెంకటప్పలు యాలాల మండల భాను చైతన్య బొమ్రాస్‌పేట అధ్యక్షులు గౌరారం గోపాల్‌, ప్రధానోపా ధ్యాయులు నర్స్యనా యక్‌, జూనియర్‌ కాలేజ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నాయకులు మహేందర్‌, గోవర్ధన్‌, కిష్టప్ప మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ప్రకాష్‌ గౌడ్‌, నాయకులు రామ చందర్‌, మియా మహిళా నాయకులు సువర్ణ రాణి, మానెమ్మ, మంజుశ్రీ, శాంత, తదితరులున్నారు.