– డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు సభ
నవతెలంగాణ-మంచాల
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కమిటీల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండగ క్రీడల ముగింపు సభలో ఆయన పాల్గొన్ని, మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుట్ల గ్రామంలో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా క్రీడలు నిర్వహించడం మంచి పరిణామ మని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి క్రీడలు ఉపయోగ పడుతాయని తెలిపారు. అనంతరం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మారబుగ్గ రాములు మాట్లా డుతూ ఈ క్రీడల్లో 36 జట్లు పాల్గొన్నాయనీ అందులో మొదటి బహుమతి శ్రీరామ్ క్రికెట్ క్లబ్ గెలుచుకోగా, రెండోవ బహుమతి యువసేన క్రికెట్ క్లబ్ గెలుపొందినట్టు తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస ్రెడ్డి, గ్రామ కమిటీ కార్యదర్శి పుల్లగల్ల గోపాల్, మండల కమిటీ సభ్యులు నూకం రవి, డాక్టర్ కొండిగారి బుచ్చయ్య, వార్డు సభ్యులు చీమర్ల గాలమ్మ, చిందం బీరప్ప, అంజయ్య, సత్తయ్య, బుగ్గయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బాబు, ఎంపీటీసీ సరిత రాజు నాయక్, వార్డు సభ్యులతో అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు విచ్చేసే క్రీడాకారులకు అల్పాహారంతో పాటు చక్కటి భోజనం, రవాణా సౌకర్యం లాంటి వసతిని కూడా కల్పించినట్టు తెలిపారు.