రాష్ట్ర సదస్సు పోస్టర్‌ విడుదల చేసిన టీజెస్‌ నాయకులు

రాష్ట్ర సదస్సు పోస్టర్‌ విడుదల చేసిన టీజెస్‌ నాయకులునవతెలంగాణ-సంగారెడ్డి
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని టీజేఎస్‌ జిల్లా అధ్యక్షులు పి.తుల్జారెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న హైద్రాబాద్‌ ఖైరతాబాద్‌లోని మోక్ష గుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగే ‘నియంతను గద్దె దించిన తెలంగాణ ప్రజలకు జేజేలు, రాష్ట్ర విభజన హామీలు కేంద్ర- ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను సంగారెడ్డి ఐబీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్న విభజన హామీలు కేంద్రం ద్వారా అమలు చేయించడంలో విఫలం చెందిన బీఆర్‌ఎస్‌ అధికారాన్ని తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందన్నారు. రాష్ట్ర అభివద్ధిని నిర్లక్ధ్యం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కష్ణ జలాల్లో తెలంగాణ నాయ్యామైన వాటా తేల్చాలని అన్నారు. ఉద్యోగుల విభజన పూర్తి చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. పెండింగ్‌ లో ఉన్న రాష్ట్ర స్థాయి సంస్థలను, ఆస్తులను విభజించాలన్నారు. రాష్టంలో హార్టీ కల్చర్‌ యూనివర్శిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, ఖాజీ పేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. టీజేఎస్‌ పార్టీ అధ్యక్షులు కోదండరామ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లాలోని యువత మేధావులు, ఉద్యమకారులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో తేజస జిల్లా ప్రధాన కార్యదర్శి కూమ్మారి సాయిలు, సమన్వయ కర్త శ్రీధర్‌ మహేంద్ర, తేజస యువజన సమితి జిల్లా అధ్యక్షుడు డి .పాండు, నాయకులు రాంరెడ్డి , విష్ణువర్ధన్‌ రెడ్డి, ఈశ్వర్‌ గౌడ్‌, ఎం.శశికాంత్‌. రవినాయక్‌, తదితరులు పాల్గొన్నారు.ోదరులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని, వత్తి, రక్షణ కోసం ఉపాధి కోసం జరిగి కార్యక్రమాలలో, మా వంతు సహాయ సహకారాలు అందించి గీతా కార్మికుల గౌడ కులస్తుల సంక్షేమం కోసం కషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం సంఘం జిల్లా నాయకులు కష్ణ గౌడ్‌, రామా గౌడ్‌, నరసింహ గౌడ్‌ వెంకటేశం గౌడ్‌, అనంతరం గౌడ్‌, ప్రతాప్‌ గౌడ్‌ అనిల్‌ గౌడ్‌ అశోక్‌ గౌడ్‌ సత్యనారాయణ గౌడ్‌, యాద గౌడ్‌, నారాయణ గౌడ్‌ కష్ణ గౌడ్‌ హరీష్‌ గౌడ్‌, సత్యనారాయణ గౌడ్‌, కష్ణ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.