– మార్పు అంటే ఇదేనా?: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదేనా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గాలేక, రైతుకు పెట్టుబడి సాయం అందక, పంటలకు నీళ్లివ్వక సాగు విస్తీర్ణం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక విషయాలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. యాసంగి వ్యవసాయ ప్రణాళిక ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దావోస్‌లో సీఎం రేవంత్ తెలంగాణ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.