
రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన మీకోసం మేము సేవా సంస్థ అధినేత లక్ష్మయ్య ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైమరీ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు, కంపాక్స్ బాక్సులు, అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఈ సేవా సంస్థ వారు వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు, పి ఆర్ టి ఓ మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, ఉపాధ్యాయులు బి .వెంకటలక్ష్మి, సాయన్న, పరమేశ్వర్, రాధా, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.