ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక క్యాంపెయిన్

– బూతు లెవల్ అధికారులతో ప్రత్యేక సమావేశం

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్త ఓటర్ల నమోదు కోసం ఈనెల 20, 21,  తేదీలలో మండల పరిధిలోని ప్రతి బూతులో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక క్యాంపియన్ నిర్వహించడానికి గురువారం నాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బూతు లెవల్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవలు అధికారులకు ప్రత్యేక క్యాంపియన్ గురించి మండల డిప్యూటీ తాసిల్దార్ భరత్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ విజయ్ కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ గురించి ఓటర్ల ఐడెంటి కార్డులో తప్పులు సరిదిద్దుకునేందుకు ఫామ్ 8 దరఖాస్తుల స్వీకరణ గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.  ప్రతి బూతు లెవల్ అధికారి తమ తమ బూత్ కేంద్రాల్లో ఈనెల 20, 21, తేదీలలో అందుబాటులో ఉండాలని డిప్యూటీ తాసిల్దార్ భరత్ బూతు లెవల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . జనవరి 1,1.2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలియజేశారు ప్రత్యేకంగా నిర్వహించే 20,21, తేదీలను మండల ప్రజలు ఓటర్ నమోదు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు ఈ ప్రత్యేక సమావేశంలో రెవెన్యూ అధికారులతో పాటు బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు