
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని, పోలీస్, మోటార్ వెహికల్ అధికారులకు సహకరించాలని ఎస్సై సాయికుమార్ సూచించారు. గురువారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు, ప్రజలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని, ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం బి ఐ జయంత్, శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.