నవతెలంగాణ -హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో వివాదాస్పద భూమికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. వివాదస్పద 14 ఎకరాలకు సంబంధించిన వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇందుకోసం 1959 నుంచి రికార్డులు పరిశీలించాలని కోరింది. సదరు భూమికి సంబంధించిన తప్పుడు పత్రాలను సృష్టించి, వాటిపై హక్కులున్నట్టుగా చెప్పి నిర్మాణాలు చేస్తున్నారనీ, వాటిని ప్రజలు కొనుగోలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ భూమి వద్ద నోటీస్ బోర్డ్ పెట్టాలని చెప్పింది. ఆక్రమాలకు సహకరించిన అధికారుల వివరాలు కూడా అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.