నవతెలంగాణ – కంటేశ్వర్
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి నిజామాబాద్ జిల్లా కమిటి కన్వీనర్ కాంబ్లె మధు ను ఎన్నికైనట్లు బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్ పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ శుక్రవారం ప్రకటించారు. ఈనెల 18-1-2024న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్ పీ జిల్లా కమిటి జనరల్ బాడి సమావేశంలో జిల్లా కన్వీనర్ గా కాంబ్లె మధు నిజామాబాద్, జిల్లా కో- కన్వీనర్లు గా అబ్బగోని అశోక్ గౌడ్ బాల్కొండ, ఎం.డి. సయ్యద్ డిచ్ పల్లి, బాల్ రాజ్ బోధన్ మరో 10 మంది కమిటి సభ్యులను ఎంపిక చేశారు. ఈ కమిటి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తైన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కమిటి ఎన్నిక ఉంటుందని దండి వెంకట్ తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి నూటికి నూరు శాతం బహుజనుల ముఖ్యంగా 90% బిసి నాయకత్వంలో పనిచేసే బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి లో బిసి కులాలు ఎస్సీ , ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజనుల పార్టీలో చేరి తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.