బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన కంటేశ్వర్ వాసులు

నవతెలంగాణ – కంటేశ్వర్ 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం నామినేషన్ వేసిన సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని పాత అసెంబ్లీ ఆవరణంలో కంటేశ్వర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు నూర్, తదితర మిత్ర బృందం భాస్కర్, సంతోష్, నూతన్ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆ నిర్ణయం మేరకు పనిచేస్తానని అలాగే నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.