మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామంలోని ముదిరాజ్ కాలనీలో గల 9వ వార్డులో మురికి కాలువల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.2 లక్షల ఎంపీటీసీ నిధులతో ఈ మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. అట్టి పనులను ఎంపీటీసీ సభ్యురాలు తోట జ్యోతి, గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్  చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీలో రూ.2 లక్షలతో మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ సభ్యురాలు తోట జ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు పోషన్న, సాగర్, నాయకులు బి.మహేష్, తోట అప్పయ్య, సక్కారం  నారాయణ, నెల్ల రమేష్, రాజు, కాలనీ వాసులు గంగారాం, రమేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.