స్వగ్రామానికి మృతదేహం

నవతెలంగాణ – డిచ్ పల్లి
గల్ఫ్ లోని సౌదీ అరేబియాలోని జెద్ద లో డిచ్ పల్లి మండలంలోని దూస్గం గ్రామానికి చెందిన సురుకుట్ల ప్రవీణ్ కుమార్ (35) బతుకు దెరువు కోసం గత ఐదేళ్ల క్రితం సౌదీ అరేబియా కుఎలక్ట్రిషన్ పని పై వెళ్ళాడు. ఈనెల 2 ను పనులు చేస్తుండగా స్టాండ్  విరిగి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సౌదీ అరేబియా లోఎన్నారై తెలంగాణ వాసులు, ఎన్ఆర్ఐ  డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన ఫరూక్ బాయ్ ఆయన టీం తో కలిసి ప్రవీణ్ కుమార్ మృతదేహం త్వరగా గ్రామానికి పంపడం జరిగిందని గ్రామస్తులు, బందువులు తెలిపారు. మృతునికి భార్య సమత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య సమత ప్రస్తుతం గర్భిణీ గా ఉందని వారన్నారు. వారి ఇంట్లో కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పంపించడానికి కృషి చేసిన ఫరూక్ బాయ్ కు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
నివాళులు అర్పించిన కోటపటి :మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరమ్ సభ్యులు దూస్‌గం గ్రామాన్ని సందర్శించి, సౌదీ అరేబియా లోని జెద్ద లో మృతి చెందిన ఎస్ ప్రవీణ్ కుమార్‌ కు నివాళులు అర్పించారు. ఈ నెల 2న మృతి చెందిన విషయం తెలుసుకుని, సౌదీలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించండం జరిగిందని వివరించారు. మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయం కి వచ్చిన వెంటనే అక్కడినుంచి ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు .తెలంగాణ ఎన్ల్నారై తెలంగాణ ప్రభుత్వం చిట్టి బాబు, బిఅర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువేరి గంగాదాస్,కుంట గంగామోహన్ రెడ్డి, సహకరించినట్లుఎంఅర్ డ్లు ఎఫ్ అద్యక్షులు కోటపాటి నర్సింహం నాయుడు తెలిపారు.