రైతులకు అవగాహన సదస్సు

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు  బ్రాంచ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు బ్రాంచ్ మేనేజర్  నవీన్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు.  రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేయించుకోవడం ద్వారా తిరిగి రుణాలను పొందవచ్చు అన్నారు. బ్యాంకు ద్వారా రైతులకు అందించే ఇతరత్రా రుణాల గురించి, బ్యాంకు ద్వారా అందించే సేవలు, ఇన్సూరెన్స్ ల గురించి మ్యాజిక్ షో ద్వారా వివరించారు.ఈ  కార్యక్రమంలో సర్పంచ్ సక్కారం,  మ్యాజిక్ షో ప్రతిప్, రైతులు పాల్గొన్నారు.