నవతెలంగాణ- రామారెడ్డి : మద్యం సేవించి, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై, కుటుంబాలకు దూరం కావద్దని శుక్రవారం ఎస్సై సుధాకర్ వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని గంగమ్మ వాగు వద్ద వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని 50 మంది వాహనదారులపై, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి వాహనాదారుడు పాటించాలని, సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, పోలీస్ సిబ్బంది లక్ష్మీకాంత్, పవన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.