ఈ నెల 29న కుడవెల్లి వాగులోకి నీరు విడుదల

– జిల్లా మంత్రి కొండా సురేఖ హామీ.
నవతెలంగాణ-తొగుట : ఈ నెల 29న కుడవెల్లి వాగులోకి నీరు విడుదల చేస్తామని ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ లోని వారి నివా సంలో కలిసి నియోజకవర్గంలోని రైతులకు యాసంగి పంటల సాగు చేసేందుకు కుడవెళ్ళి వాగులోకి నీటినీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ రైతుల పంటల సాగు కోసం ఈ నెల 29 వ తేదీన కుడవెళ్లి వాగులోకి నీరు విడుదల చేస్తామని ప్రక టించారు. నీటి విడుదల చేస్తామని ప్రకటించినం దుకు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రినికలిసిన వారిలో సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జి పూజల హరికృష్ణ తదితరులు ఉన్నారు.