మౌన పోరాటంలో గిరిజన గ్రామాలు

– నిశ్శబ్దమేలుతున్న ఆదివాసీలు
– ఎదురుకాల్పులతో మావోయిస్టులకు తీరని నష్టం?
– అతివిశ్వాసమే అంతటికీ కారణమా
– అంతర మదనంలో మావోయిస్టులు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు చత్తీస్గడ్‌ బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర పోరులో మావోయిస్టుల సాయంత్రం మొదలుకొని తెల్లవారులు విశ్వ ప్రయత్నం చేసి కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో సామాన్య ప్రజలే ఎక్కువ మంది చనిపోయినట్లు సమాచారం. తమ వారు అదంతరంగా చనిపోవడంతో దండకారణ్యంలోని ధర్మారం, సండ్రం బోరు గాంపాడు, గాదె గూడ, జీడిపల్లి, సప్పేడు పెద్ద గొల్లగూడెం, చిన్న గొల్లగూడెం, కంచాల బట్టి గూడెం, కౌరుగట్ట, కొండపల్లి, యాంపురం గుండంతో గూడెం మీన గట్టు, జొన్నగూడెం, పువర్తి మొదలైన ఆదివాసీ గ్రామాల్లో నివసించే ఆదివాసీలలో మౌనం పోరాటం గట్టిగా కొనసాగుతుంది.
నిశ్శబ్దమేళుతున్న ఆదివాసీలు
మావోయిస్టులకు, సీఆర్పిఎఫ్‌ 151 బెటాలియన్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎక్కువమంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. మావోయిస్టులతో పాటు సామాన్య ప్రజలు, కొరియర్లు గ్రామ కమిటీ సభ్యులు, తల సభ్యులు మృతి చెందడం వలన తమరు చనిపోయారని విషయాన్ని వెల్లబుచ్చడానికి కూడా ఆదివాసి గ్రామాల ఆదివాసీలు ససిమేరా అంటున్నారంటే ఆయా గ్రామాల గిరిజనులు తమ తమ దుఃఖాన్ని దిగమింగుకొని నిశ్శబ్ద వాతావరణంలో ఏమి చేయలేని దుస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో 3 క్యాంపులపై మావోయిస్టులు చేసిన దాడి విఫలం కావడంతో నష్టాన్ని మావోయిస్టుల అధినాయకత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎదురు కాల్పులతో మావోయిస్టులకు తీరని నష్టం
పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు తీరని లోటు జరిగినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టులను నమ్ము కొని వచ్చిన సామాన్య ప్రజలు సైతం పోలీసుల తూటాలకు బలైనట్లు తెలుస్తుంది. సిఆర్పిఎఫ్‌ క్యాంపులే లక్ష్యంగా సుమారు 3000 మంది సామాన్య ప్రజలతో పాటు సాయుధులైన 300 మంది మావోయిస్టులు సుమారు పది గంటల పాటు పోరాడిన క్రమంలో మావోయిస్టుల సానుభూతి పరులు, మిలీషియా సభ్యులు, దళం సభ్యులు పోలీసు దాటికి నేలకొరిగినట్లు తెలుస్తుంది. ఎదురు కాల్పుల వలన పోలీసుల కన్నా మావోయిస్టులకే ఎక్కువ నష్టం జరిగినట్లు సమాచారం.
అతివిశ్వాసమే అంతటికి కారణమా
మావోయిస్టులో నెలకొన్న అతి విశ్వాసం వల్లనే పోలీస్‌ పంజాగు బలి కావాల్సి వచ్చిందా అనే కోణంలో పలువురు విశ్లేషిస్తున్నారు. అధునాతనమై మందు గుండు సామగి, బాంబులు పెద్ద ఎత్తున ఉన్న సిఆర్పిఎఫ్‌ క్యాంపులపై ఏకకాలంలో మూడు క్యాంపులు పై దాడి చేసి గెలవాలని అతి విశ్వాసం మావోయిస్టులో ఉండడం వలనే మావోయిస్టులు ఘోరంగా విఫలమైనట్లు పెద్ద ఎత్తున నష్టం చేకూరినట్లు స్పష్టమవుతుంది. పోలీసులు ఆచితూచి అడిగేసి తమనుతాము కాపాడుకుంటూ మావోయిస్టులను మట్టు పెట్టడానికి ప్రధాన కారణం అని తెలియకనే తెలుస్తుంది.
అంతర మదనంలో మావోయిస్టులు
మాస్టర్‌ మైండ్‌ హిడ్మా స్కెచ్‌ గీసి పోలీసులను హతమార్చిన సంఘటనలు ఎన్నో ఉండగా గత మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా స్కెచ్‌ సఫలం కాలేదని మావోయిస్టులు అంతర మదనం చెందవలసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా దెబ్బతిన్న పులిలాగా మావోయిస్టులు ఎప్పుడు ఏ దురాగతానికి పాల్పడతారని ఆదివాసీ గ్రామాల ప్రజలు చిగురుటాకుల వలే వనికి పోతున్నారు.