– అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి జి.పద్మ
నవతెలంగాణ-పాల్వంచ
మినీ టీచర్స్ అందర్నీ మెయిన్ టీచర్స్‌గా అప్గ్రేడ్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడాన్ని సీఐటీయూ యూనియన్‌గా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ స్వాగతిస్తున్నాం అని అంగన్వాడీ జిల్లా కార్యదర్శి జి.పద్మ అభినందనలు తెలియజేశారు. శుక్రవారం ఆమె మాట్లాడారు. సీఐటీయూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్‌గా అనేక పోరాటాలు, ప్రాజెక్టు ధర్నాలు, రిలే దీక్షలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు, కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాలు, కమిషనర్‌తో ముఖాముఖి చర్చలు, అనేక పోరాటాలు సీఐటీయూ యూనియన్ చేసినటువంటి ఫలితంగానే మినీ టీచర్స్ అందరూ మెయిన్ టీచరుగా అప్ గ్రేడ్ అయ్యారని అన్నారు. మినీ టీచర్స్ 14 సంవత్సరాలుగా పిల్లలను తీసుకోవడం రికార్డ్స్ రాయడం వంట చేయడం ప్రీస్కూల్ నడపడం ప్రభుత్వ సర్వేలో పాల్గొనడం పిల్లలకు నిద్రపుచ్చడం బాత్రూంలో తీసుకెళ్లడం ఈ రకంగా టీచర్ విధులు హెల్పర్ విధులు ఇద్దరి విధులు ఒక మినీ టీచర్గా నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు 14 సంవత్సరాలుగా పడ్డారని వారి సేవలను కొనియాడారు. అప్గ్రేడ్ చేసిన మంత్రి సీతక్కకి అభినందనలు తెలియజేస్తూ అదే సందర్భంలో ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన టీచర్స్ అందరికీ హెల్పర్స్‌ను వెంటనే నియమించాలని వారి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ హెల్పర్ పోస్ట్లు భర్తీ చేయాలని, డ్యూటీలు రద్దు చేయాలని, కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సత్య, దొడ్డ రవికుమార్, అంగన్వాడీ జిల్లా కోశాధికారి వెంకటరమణ, రాజ్యలక్ష్మి, పద్మ, అనసూర్య, పుల్లమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.