అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

నవతెలంగాణ – కంటేశ్వర్
గత నెల ఆర్మూర్ పెర్కట్ రోడ్డు పై గుర్తు తెలియని ఓ అనాధ ఆనారోగ్యంతో ఉండగా అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే వైద్యసేవల నిమ్మిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది అని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సాయిబాబా శనివారం తెలిపారు.చికిత్స పొందుతూ గత 6 రోజుల క్రితం మరణించాడు తనకి సంబంధించినవారు ఎవరు రాకపోవడంతో ఆ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గంగాధర్  కోరగా, నేడు  బాబాన్సిపాడ్ స్మశాన వాటికలో  అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో  అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్మామ్ హింద్ ముంమేట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థల ప్రతినిదులు డా.సజ్జాద్, మహ్మద్ జాహీర్, హశ్వా,మన్నాన్, షేక్ హుస్సేన్.హలీమ్ ఇందూరు యువత కార్యవర్గం మద్ది గంగాధర్, కాసుల సాయితేజ అలాగే ఆర్మూర్  పోలిస్ సిబ్బంది వినయ్  తదితరులు పాల్గొన్నారు.