ఆర్థిక సాయం అందుచేత.. 

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 3వ వార్డు శనివారం, ఇటీవలే అనారోగ్యం కారణంగా సయ్యద్ ఫారుక్ భార్య సయ్యద్ షరిఫబీ మృతి చెందినారు. వారి  కుటుంబాన్ని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి  పరామర్శించి, ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహకారాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ యాదవ్, గౌటి సదానందం, మోత్కుపల్లి బిక్షపతి, మోత్కుపల్లి భాస్కర్, బూడిద వెంకటేష్, బూడిద రాజు, పులిగిల్ల గిరి,  షేక్ నజీర్, సయ్యద్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.