
సారంగాపూర్ లోని బీఈడీ కళాశాల విద్యార్థులకు మెయిన్ క్యాంపస్ లో హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ.. యూనివర్సిటీ పరిపాలన భవనంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి ని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో సారంగాపూర్ లోని బీఈడీ కళాశాల విద్యార్థులకు మెయిన్ క్యాంపస్ లో హాస్టల్ వసతి కల్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ కార్యదర్శి బానోత్ సాగర్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ లో గత 4 ఏళ్లుగా సారంగాపూర్ లోని బీఈడీ కళాశాల విద్యార్థులకు మెయిన్ క్యాంపస్ లోనే హాస్టల్ వసతి కల్పిస్తున్నారని , ప్రతి సంవత్సరం కల్పించిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఆ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలని సూచించారు. యూనివర్సిటీ లో చదివే విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి వస్తారని, సెమిస్టర్ ఎగ్జామ్స్ సమయంలో కానీ, ఇంటర్నల్స్ రాసే సందర్భంలో కానీ నానా ఇబ్బందులు పడతారని, యూనివర్సిటీ అదికారులు స్పందించి మెయిన్ క్యాంపస్ లోని హాస్టల్ వసతి కల్పిస్తే యూనివర్సిటీకే మంచి పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి అల్లూర్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.