
భువనగిరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొర్రి సురేష్ ని శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని గుర్తించి అధిష్టానం ఆదేశానుసారం ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా తొలి సురేష్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా పార్టీ కోసం పని చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగరి గారి ప్రీతంకి, జిల్లా అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ గారికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి డిసిసి అధ్యక్షులు అండెం సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి కోసం రాబోవు పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శక్తికి మించి పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు ఏగూరి ఉదయ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోకల యాదగిరి, నాయకులు మహంకాళి సురేష్, రెంటాల ప్రవీణ్, పోకల సాయికుమార్, వాకిటి కుమార్, కొంగరి మహేష్, తొర్రి అనిల్ పాల్గొన్నారు