ప్రజల పత్రిక నవతెలంగాణ..

– నవతెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ డీసీపీ, ఆర్డీవో, ఏసిపి

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
ప్రజల పత్రిక నవతెలంగాణ అని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నసిమా సుల్తానా శనివారం అన్నారు. జక్రాంపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు పోలీస్ శాఖ నిజాంబాద్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా న్యాయ చైతన్య సదస్సుకు హాజరైన ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నర్సింహ సుల్తానా, అడిషనల్ డీసీపీ జయరాం, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, నిజాంబాద్ ఏసిపి విజయ సారథి నవతెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల రాజు, గ్రామ సర్పంచ్ చంద్రకళ బాలకిషన్ తాసిల్దార్ కలీం, ఇన్చార్జి ఎంపీడీవో బ్రహ్మానందం, జక్రాన్ పల్లి ఎంపీటీసీలు రూపాల గంగారెడ్డి, తలారి మరియా సతీష్, మండల కోఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు గొర్త రాజేందర్, ఎస్సై తిరుపతి పోలీస్ సిబ్బంది అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.