ప్రజా సమస్యలు వెలికి తీసే పత్రిక నవతెలంగాణ..

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 

ప్రజా సమస్యలు వెలికి తీసేది నవతెలంగాణ పత్రిక అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఈ రోజు అన్నారు. మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన నవతెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు  వినోద్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మునుపెల్లి సాయి రెడ్డి, మున్పెల్లి సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల్పాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.