
జక్రాన్ పల్లి మండలం కోలిప్యాక్ గ్రామంలో శనివారం శ్రీ ఆనందగిరి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డా భూపతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను ఎమ్మల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మొక్కున్నని ఆ దేవుని దయతో ప్రజలు తనను కాంగ్రెస్ పార్టీని దివించరని అందుకు కృతజ్ఞతగా ఎమ్మల్యే సతి సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా ప్రజలు అందిస్తునదనియాన్నరు. ఆలయంలో కోనేరు పునరుద్దరణ ఇతర అభివృద్ధికి అలాగే కొలిప్యాక్ నుండి జాన్కంపేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అర్గుల్ చిన్న రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మునిపెల్లి సాయి రెడ్డి, మునుపెల్లి సర్పంచ్ సాయి రెడ్డి, అర్గుల్ సర్పంచ్ గొర్త పద్మ రాజేందర్. కోల్ ప్యాక్ మాజీ సింగిల్ విండో చైర్మన్ మామిడి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మద్దుల రమేష్, మాజీ సర్పంచ్ భూమన్న, అర్గుల్ ఎంపీటీసీ అనిత, చిన్న రెడ్డి, మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, సోప్పారి వినోద్. లక్ష్మణ్. గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.