వంద పడకల ఆసుపత్రి లో అన్ని వసతులు కల్పిస్తాం.. 

– అచ్చంపేటలో నర్సింగ్ కాలేజీకి కృషి. 
– భూ కబ్జాదారులపై చర్యలు తప్పవు
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.  దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ – అచ్చంపేట: నల్లమల్ల ప్రాంతం వెనుకబడిన అచ్చంపేట నియోజక వర్గంలో వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, 100 పడకల ఆసుపత్రికి వైద్య పరికరాలతో పాటు వైద్య సిబ్బందిని కనిపిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.  శనివారం పట్టణంలో వంద పడకల ఆసుపత్రి సందర్శించారు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.  మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెంచు గిరిజనులు అధికంగా నివాసం ఉంటున్నారు వారికి సరైన సమయంలో వైద్యం అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రసవ సమయంలో వైద్యవందక ప్రాణాలు అర్పించిన సంఘటన చూసి చలించిపోయారన గుర్తు చేశారు. 100 పరకాల ఆస్పత్రి కట్టడమే తప్ప ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించ లేదన్నారు.  ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు ఆపరేషన్ కు సరిపడా పరికరాలను డాక్టర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని సూచించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇక్కడ మారుమూల ప్రాంతం కాబట్టి హైవే రోడ్డు దగ్గర ఉండడం కారణంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని ఎమర్జెన్సీ  సెంటర్ ఏర్పాటు చేయాలని, బ్లడ్ బ్యాంకు  ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  అచ్చంపేటలో నర్సింగ్ కాలేజీ కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నల్లమల ప్రాంతంలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అసైన్ భూములు ఎవరైనా ఎంతటి వారైనా కబ్జాదారులు ఉంటే చర్యలు తీసుకుంటామని కబ్జాదారులను హెచ్చరించారు. ప్రభుత్వ భూములు కాపాడుకోవడం మా లక్ష్యం అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతం మారుమూల ప్రాంతంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు, స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. స్పందించిన మంత్రివర్యులు పరిశ్రమలు ఏర్పాటు దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాజీవ్ నగర్ కాలనీలో బస్తీ దవఖానకు శంకుస్థాపన చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించే దిశగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుధాకర్ లాల్,  డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ తారా సింగ్, ఆస్పత్రి సూపర్ డెంటెడ్  డాక్టర్ ప్రభు వైద్య సిబ్బంది ఉన్నారు.