
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సైబర్ నేరాలపై చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ఓటిపి, ఇన్వెస్ట్మెంట్, బెట్టింగ్ లపై సైబర్ నేరాలకు మోసపోకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనా మోసాలకు మోసపోయామని గ్రహిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.దుర్గయ్య,ఎస్ఎంసి చైర్మన్ కైరంకొండ అశోక్,ప్రాథమిక పాఠశాల చైర్మన్ వర్కాల రఘురాం తదితరులు పాల్గొన్నారు.