నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యలు లు శనివారం రాజీనామాలు మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. రాజీనామా చేస్తారని మూడు రోజుల ముందు నుండి చేరుకుంటున్న ఊగిసలాట జరిగి, ఎటికేలకు తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వారు రాజీనామా పత్రంలో తమ వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వాటిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.ఛైర్మన్ తో పాటు పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
టూర్ లో కౌన్సిలర్లు: ఈనెల 23న ప్రస్తుత చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్యలపై అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఉన్న సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కౌన్సిలర్లు వేరువేరుగా టూర్లకు వెళ్లారు. అవిశ్వాసం రోజు రావడానికి రెండు రోజుల ముందే ఛైర్మన్ వైస్ చైర్మన్లు రాజీనామా చేయడం జరిగింది. టూర్ లో ఉన్న కౌన్సిలర్ ఎత్తులను చిత్తు చేయడానికి ఈ రాజీనామాలు చేసినట్లు సమాచారం.