నవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి.సంధ్యను డాక్టరేట్ వరించింది. ‘పర్యావరణ, జీవ సంబంధ అనువర్తనాల కోసం మెటల్, మెటల్ అక్సెడ్ సూక్ష్మ- సమ్మేళనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమ ర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహి స్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నాగేంద్ర కుమార్ పుట్టా శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్ల డించారు. హై దరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ (రిటెర్డ్) ప్రొఫెసర్ శ్రీధర్ బొజ్జా బాహ్య పరిశీ లకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు. సంధ్య తన సంచల నాత్మక సిద్ధాంత వ్యాసంలో మొక్కల సారాలను ఉపయో గించి మెటల్, మెటల్ అక్సైడ్, మెటల్ ఫెర్రెట్ సూక్ష్మ- సమ్మేళనాలను సంశ్లేషణ చేయడంలో పర్యావరణ హిత రసాయన సూత్రాల వినూత్న అనువర్తనాలను అన్వేషించినట్టు పేర్కొన్నారు. వివిధ మొక్కల మూలాల నుంచి నానో సమ్మేళ నాల ఆకుపచ్చ, సంశ్లేషణను ప్రస్ఫుటం చేస్తుం దని, వాటి ఎంపిక, సున్నితత్వం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ బయోసిం థసెజ్డ్ పదార్థాలు విషపదార్థాలను తొలగిస్తాయని, ఉత్ప్రే రక, బయోవె ుడికల్ రంగాలలో బాగా ఉపయోగపడతాయ ని ఈ పరిశోధనలో తేలిందన్నారు. గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్‌రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పలువురు ఈ సందర్భంగా సంధ్యను అభినందించారు.