హెచ్‌ఐవి ఎయిడ్స్‌పైన అవగాహన

నవతెలంగాణ-కౌడిపల్లి
నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వారి సహకారంతో జిల్లా కలెక్టర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డిపిఎం ఆధ్వర్యంలో హెచ్‌ఐవి ఎయిడ్స్‌ అవగాహన కళజాత ప్రదర్శన శనివారం నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో కనకదుర్గ కళా సమితి బుజంగం పొన్నాల బందం ఆటపాటలతో హెచ్‌ఐవి ఎయిడ్స్‌పైన ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించారు. ప్రజలు హెచ్‌ఐవి ఎయిడ్స్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని, సుఖ వ్యాధులు ఉన్నవాళ్లు సురక్ష కేంద్రానికి వెళ్లాలన్నారు. హెచ్‌ఐవి గర్భిణీ స్త్రీలు పీపీటీసీటీ సెంటర్‌కు వెళ్లాలన్నారు. ఎయిడ్స్‌ అంటువ్యాధి కాదని హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వచ్చిన వారి పట్ల వివక్ష చూపకూడదన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌ ఏ విధంగా సోకుతుందో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు భుజంగం, మురళి, ఓంకారం, కష్ణ, విధిమౌళి, లక్ష్మీశాంతి, మెదక్‌ స్కోప్‌ స్వచ్ఛంద సంస్థ పిడి ఉప్పలయ్య, డిఆర్‌పి నగేష్‌, సూపర్వైజర్‌ అమరేందర్‌, ఉమారాణి, ఆశా వర్కర్‌ చెన్నమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.