ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్

 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను తహసిల్దార్ ఆంజనేయులు ఆదివారం సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన బూత్ ల వివరాలను ప్రత్యేక ఓటర్ నమోదుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఇప్పటివరకు కొత్త ఓటర్ నమోదు కోసం, మార్పులు చేర్పుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని బూత్  లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటరు ఎవరైనా ఉంటే వారికి వారి ఓటు హక్కు ప్రాధాన్యత గురుంచి అవగాహన కల్పించి, వారితో ఫారం నెంబర్-6 కి దరఖాస్తు చేయించాలన్నారు.కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే వారి కోసం ఫారం నెంబర్-6,  ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొర్లితే దాన్ని సరిదిద్దుకొనుటకు ఫారం నెంబర్-8,  ఎవరైనా మరణించిన, శాశ్వతంగా షిఫ్టు అయిన వారి కోసం ఫారం-7ని అప్లై చేయించాలని సూచించారు.ఏ రోజు దరఖాస్తులను ఆ రోజే ఆన్ లైన్ చేయాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్  లెవల్ అధికారులు సరిత, శోభ, బాజే సాబ్, పంచాయతీ సిబ్బంది రవి, తదితరులు పాల్గొన్నారు.