హాస కొత్తూర్ లో దోమల నివారణకు ఫాగింగ్

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హసకొత్తుర్ గ్రామంలో దోమల బెడద నుండి ప్రజలను కాపాడేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఫాగింగ్ చేయించారు. గ్రామంలో దోమల బెడద ఎక్కువవడంతో గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ స్పందించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివరణకై గ్రామం తోపాటు మరుతినగర్ కాలనీలో గల్లి గల్లిలో ఆటో ద్వారా ఫాగింగ్ చేయించారు. గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. దోమరం నివారణకు చేపట్టిన ఫాగింగ్ ను ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశోభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వృద్ధుని అరికట్టవచారున్నారు.చెత్త చెదరం మురికి కాలువలో వేయవద్దని, గ్రామపంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిలువ చేసుకొని, పంచాయితీ చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కరోబార్ రమణ, భారత్, తదితరులు పాల్గొన్నారు.