పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
జడ్.పీ.హెచ్.ఎస్ గొల్నేపల్లి వలిగొండ మండలం 1977-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హైవే 9 హోటల్ చౌటుప్పల్ లో ఆదివారం నిర్వహించారు. ఆనాటి ప్రధానోపాధ్యాయులు శివగల్ల నరసింహ, సీహెచ్ రూపన్ కుమార్ లను ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాలు తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఉపాధ్యాయులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉమేష్, అజయ్ కుమార్,శరత్ బాబు,లింగస్వామి,శ్రీలత దేవకమ్మ,శైలజ,నాగమణి,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.