నేటి నుండి ఉచిత బియ్యం పంపిణీ

– మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో బుధవారం నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధునీకరణ కారణం వల్లే రేషన్‌షాపులు తీయడంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు. డిసెంబర్‌ వరకూ కేంద్రం ఇచ్చిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం సొంతంగా రేషన్‌ కార్డు దారులకు పది కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. జనవరి నుంచి కేంద్ర నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి సాఫ్ట్‌వేర్‌ ఆధునీకరణ చేయాల్సి వచ్చిందన్నారు.