ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – గోవిందరావుపేట
నోట్ యాడ్ న్యూస్ మండలంలోని రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని 27.05.2023. ఉదయం 10.00 గంటలకు గోవిందరావు పేట రైతు వేదికలో నిర్వహించబడుతుందని మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలం లోని రైతులు ఈ రాన్నున్న సీజన్లో 1000 ఎకరాలు పామ్ ఆయిల్ మొక్కలు నటుకోవడంకి సిద్దంగా ఉన్నాయి అన్నారు. కావున ఈ పంటపై రైతులకు అవగాహన కల్పిస్తూ సాగు చేయడానికి సిద్దంగా ఉన్న రైతుల నుండి అప్లికేషన్స్ తిస్కోవడం జరుగుతుంది కావున ఇంట్రెస్ట్ ఉన్నా రైతుకు ఏకరానికి 57 మొక్కలు , డ్రిప్ అందించడం జరుగుతుంది. కావల్సిన డాక్యుమెంట్స్  రెవెన్యూ లాండ్ పట్టా పాస్ బుక్ మరియు ధరణి 1బి.. ఆధార్ కార్డ్. బ్యాంక్ అకౌంట్. నీటి వసతి బోరు లేదా బావి ఉండాలి. ఆయిల్ పామ్ సాగు కోసం న్యూ అప్లికేషన్స్ చేసుకోవడం , సబ్సిడి వివరాలు మరియు తోటల్లో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల మరియు డ్రిప్ కంపెనీ అధికారుల సూచనలు తీసుకోవాలి. ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసునుబట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం మండలం లోని రైతులు అందరూ గోవిందరావు పేట రైతు వేదికలో శనివారం 27.05.2023 ఉదయం 10.00 గంటలకు నిర్వహించబడును కావున రైతులు అందరూ ఇ కార్యక్రమంలో పాల్గొని అవగాహన పెంచుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.