రైతు ఆత్మహత్యలకు సజీవసాక్ష్యం ‘ధరణి’

2020 సెప్టెంబరు నెలలో ధరణి చట్టం తెచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. కొత్త ప్ర భుత్వం వచ్చింది. ఎన్నికల సమయంలో ధరణి చట్టా న్ని బంగాళాఖాతంలో వేయాలని ఒకరు, ఆ మాట అన్నవాళ్ళనే బంగాళా ఖాతంలో వేయాలని మరొకరు ఇలా హోరాహోరీగా ప్రచారం సాగింది. ధరణి చట్టం తెచ్చిన బాధలు, రైతులు పడ్డ అవస్థలు అంటే వ్యవ సాయ భూమి కలిగిన వారి ఇక్కట్లు లెక్కలే నన్ని సార్లు పత్రికల్లో ప్రచురించడం యావత్‌ తెలం గాణ ప్రజానీకం గమనించిన విషయ మే. ధరణి చట్టం ప్రకారం రైతు తన భూమి రెవిన్యూ రికార్డులలో నమోదు కాని యెడల తీవ్ర నిరాశకు గురై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసు కున్న సంఘటనలు కూడా అనేకం, అయితే గత ప్రభుత్వానికి ఇదేమీ పట్టినట్లు కనపడలేదు. పైగా ధరణి చట్టం తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ఎదురుదాడికి దిగారు. రైతుల మనసుల్లో ఇంత విధ్వంసం సృష్టించిన ధరణి చట్టం మరేదోకాదు. 1971 (రికార్డ్స్‌ రైట్స్‌) ఆర్‌.ఓ. ఆర్‌. చట్టాన్ని సమూ లంగా రద్దుచేసి, దానిస్థానంలో తెచ్చినటువంటి 2020 రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టమే ఈ ధరణి.
ఈ కొత్త చట్టంలో రెవిన్యూ రికార్డులలో రైతుల పేర్లు కంప్యూటర్‌ ద్వారా ఎక్కించే ప్రక్రియకే ధరణి అని నామకరణం చేశారు. గత ప్రభుత్వానికి ధరణి అనే పేరు అత్యంత ఆకర్షణీయంగా వున్న పదంగా కన్పించినట్లుంది. సాధారణంగా ఒక చట్టానికి ఒక ప్రత్యేకమైన పేరుతో ప్రచారం చేయడము అవసరం అనిపించుకోదు. ఏ చట్టానికైనా వాడుకలో అర్థమ య్యే విధంగా ఆ చట్టం తీసుకొచ్చిన సంవత్సరం ఆ చట్టానికో నెంబరు వుంటుంది. అసలు ప్రశ్న ఈ ధ రణి అనబడే చట్టాన్ని 1971లో వచ్చిన ఆర్‌.ఓ.ఆర్‌. చట్టాన్ని సమూలంగా రద్దుచేసి, ధరణి అనే చట్టాన్ని ఎవరు తెమ్మన్నారు. రైతులు కోరారా, ప్రజలు అడి గారా, లేదా గత పాలకుల బుర్రలో మాత్రమే పు ట్టిందా? ప్రజా జీవితంలో ఒక చట్టం స్థానంలో మరొ క చట్టం తేవాలంటే పాతచట్టం చేసిన తప్పులేమిటో కొత్త చట్టం తేచ్చే మంచే మిటో పాలకులకు, వారికి సలహాలిచ్చే ఉన్నతాధికారులకు కనీస అవగాహన వుండాలి.
ధరణి చట్టం తెచ్చినవారు ఈ రెండు అంశాలను కనీసం పరిశీలించినట్లు కనిపించడము లేదు. ఎందు కంటే రైతుల పేర్లు రెవిన్యూ రికార్డులలో నమోదు చేసే నిరంతర ప్రక్రియ నిజాం కాలం నుండి ప్రజా స్వామ్య ప్రభుత్వాలకు ఒక పరంపరగా లభించిన వారసత్వం రైతుల పేర్లను రెవిన్యూ రికార్టులలో నమోదు చేసే ప్రక్రియ కాంగ్రెస్‌ ప్రభు త్వం 1971 లో తెచ్చిన ఆర్‌.ఓ.ఆర్‌. చట్టం 1971 నుండి 2020 వరకు 49ఏండ్ల పాటు సజావుగా నడిపింది. 1971 లో వచ్చిన చట్టం రైతులను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. 1978-79 కాలంలోనే ఈ చట్టం కింద రైతు పాసుపుస్తకాలు కూడా ఇవ్వబడినవి.
ఈ రోజుకు కూడా ఏదైనా రైతుకు ఒక భూమి మీద హక్కుల విషయమై పరిశీలించి అంతిమ నిర్ణ యం చేయాలంటే 1954, 1955లలో తయారు చేసిన ఆర్‌.ఓ.ఆర్‌. (రెవెన్యూ రికార్డు)ను ప్రామాణి కంగా తీసుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రతిష్టాత్మకమైన కేసులలో ఈపాటికే స్పష్టం చేయ డము జరిగింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులలో ఒక రైతుపేరు సరిగానే నమోదు చేయ బడిందా లేదా అనేది న్యాయ సమీక్ష్షకు లోబడి వున్న టువంటి విష యం. అంటే ఒక ఇద్దరి మధ్య తగాదా వస్తే, అది రెవె న్యూ అధికారులు తీర్చేదికాదు. అది కోర్టు తీర్పు ద్వా రానే తేల్చవలసిన విషయం. రెవిన్యూ రికార్డులు సి విల్‌ కోర్టులలో వాదోపవాదాల మధ్య సాక్ష్యాలుగా మాత్రమే పనికివస్తాయి. రెవిన్యూ రికార్డులలో ఒక రైతు పేరు చట్ట ప్రకారమే చేర్చబ డిందా లేదా అనే విషయం కూడా కో ర్టులు మాత్రమే తేల్చాలి అని భారత రాజ్యాంగం చెబుతుంది. అయితే విం తైన విషయం ఏమిటంటే ఈ ధరణి చట్టంలో తాము తయారుచేసిన రెవిన్యూ రికార్టులలో చేరికలు, సవర ణలు లేక తొలగింపులు ఏదిచేసినా సెక్షన్‌-9 ధర ణిచట్టం ప్రకారం కోర్టులలో ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. ఇది ఎట్లా రాజ్యాంగ సమ్మ తమో ఆ చట్టం తెచ్చినవారే చెప్పాలి. అలానే ధరణి చట్టంతో రికా ర్డులను నమోదు చేసినరీతిలో వుంటే మాత్రమే కోర్టు తీర్పులను అమలు చేస్తాం లేదంటే కోర్టు తీర్పు అమ లుకు నోచుకోదు.అనే విచిత్రం సెక్షన్‌-7, క్లాజు-4 ధరణి చట్టంలో రాసుకున్నారు. ఈ రాజ్యాంగ విరు ద్ధమైన పైన తెలిపిన రెండు సెక్షన్లను హైకోర్ట్టు వారు సుమోటోగా కొట్టివేయదగ్గ చట్టవ్యతిరేక సెక్షన్లు.
ధరణి చట్టం పోకడ ఏమిటంటే ఉదాహరణకు ఒక రైతు ఎకరం భూమి కలిగివుంటే, అది ధరణిలో ఎక్కితేనే అతనికి చెందినది, అదే ధరణిలో పేరు నమోదు కాకపోతే ఇక అతనికి ఆత్మహత్యే శరణ్యం. ఎందుకంటే ధరణి ప్రకారం అతని అవసరాలకు అతను అమ్మజాలడు. రైతు భూమి హక్కు కలిగి వుండటమంటే అనుభవించే హక్కు, అమ్ముకునే హక్కు ధరణిలో పేరు నమోదు కాకపోతే అతను అమ్ముకోవటానికి వీలులేదు అనేది ధరణి చట్టం చేసిన విధ్వంసం. రైతు ఆధీనంలో వున్నభూమి రెవి న్యూ రికార్డులలో నమోదు కాబడని ఉదాహరణలు మనరాష్ట్రంలో వేలాదిగా వున్నాయి.
అటువంటి వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం జరగలేదన్నది యదార్థం. అయినప్పటికీ ఈ ధరణి చట్టం రాకముందు ఏ తెలంగాణ రైతును 1971, ఆర్‌.ఓ.ఆర్‌. చట్టం ఏ విధంగానూ బాధించ లేదు. 1971 చట్టానికి 1989లో ఎన్టీఆర్‌ పాలనలో ఒక చక్కటి సవరణ తెచ్చారు. దాని ప్రకారమే క్షేత్రస్థాయి విచారణచేసి, సుదీర్ఘకాలం వాస్తవంగా స్వాధీనంలో వున్న రైతులకు పట్టాదారు, టైటిల్‌డీడు పుస్తకాలు అందజేశారు. ఆ ప్రక్రియను ఇప్పటివరకు పెద్దగా కోర్టులు తప్పుపట్టిన దాఖలాలు బహు స్వల్పం. కాబట్టి 1989లో ఎన్టీఆర్‌ చేసిన సవరణచట్టం రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. ఎందు కంటే ఎవరైనా రైతుకు అన్యాయం జరిగిందని అని పిస్తే ఆచట్టంలో సెక్షను-8 కింద కోర్టుకు వెళ్ళే సంపూర్ణ స్వేచ్ఛను కల్పించారు. ఇదంతా ఒక ఎత్త యితే, అసలు స్థిరాస్థి మీద హక్కులు ఏ విధంగా ఏర్పడతాయో హిందూ సెక్షన్‌ యాక్ట్‌ (హిందువులైతే) ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌, రిజిష్ట్రేషన్‌ యాక్ట్‌ తదితర సెంట్రల్‌ చట్టాలు మనకు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌కు లోబడి ఒకరినుండి ఒకరికి భూ బదలా యింపు జరిగితేనే రెవిన్యూ చట్టం కింద పాసుబు క్కులు ఇవ్వవచ్చు. అటువంటిది ధరణి వలననే భూ బదలాయింపులు జరుగబడుతున్నాయి అని చట్ట విరుద్ధమైన ప్రచారాలు కూడా చేయడము జరిగినది. అందుకే ధరణిలో పేరు ఎక్కకపోతే రైతుకు చావే శరణ్యం అనే పరిస్థితి తెచ్చారు.
తన సుదీర్ఘకాలం అనుభవ స్వాధీనంలో వున్న స్థిరాస్తిని ఏ ఇతరుల నుండి కూడా అభ్యం తరాలు లేని ఆస్తిని క్రయపరిచే హక్కు రైతుకు చట్టం అనుమతిస్తుంది అని చెప్పవచ్చును. అటు వంటి భూమిని ధరణిలో ఎక్కించలేదు కనుక, నువ్వు అమ్మటానికి వీల్లేదు అనే ధరణి శాసనం కూడా రాజ్యాంగ పరంగా ప్రశ్నించతగినదే. రెవె న్యూ రికార్డుల నిర్వహణలో ప్రతిరైతు ఆధీనంలో వున్న భూమి అది పట్టాదారు హోదాలో వున్నదా, లేదా కేవలం స్వాదీనపు హోదాలో వున్నదా తెలియ పరచేటట్లుగా వుండాలి. రెవిన్యూ రికార్డుల నిర్వహణ అంటే అదే.అటువంటిది స్వాధీనం సూచించే పట్టిక పూర్తిగా ధరణిలో తొలగించారు. పహాణి పత్రికలను కంప్యూటర్‌ ద్వారా ఇవ్వడము లోగా కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఏనాడో ప్రారంభించినవి. ఆ కంప్యూ టరీకరణ ఆధారంగానే 2018లో రెండుసార్లు 2019లో రెండుసార్లు 2020లో ఒకసారి గత ప్రభు త్వం రైతుబంధు జమచేయడం జరిగినది. కాబట్టి ధరణిని తీసేస్తే రైతు బంధు ఆగి పోతుందనే మాట అబద్ధం. పట్టేదారు అంటే భూ యజమాని పట్టా భూమి పౌరులకు సంబంధించిన ప్రయివేటు ఆస్తి పౌరులకు సంబంధించిన భూమి వివరాలు పొందు పరిచే రికార్డు ఆఫ్‌ రైట్స్‌లో ప్రభుత్వ పెద్దల బొమ్మలు ముద్రించడము కూడా అభ్యంతరకరమే.
రాష్ట్రంలో మొత్తంగా చూసినప్పుడు ఒక రైతు తన ఎకరం పొలం రికార్డుల్లోకి ఎక్కించకుండా అమ్ము కునే హక్కు మీద ఆంక్షలు విధించడము అన్యాయం, అమానుషం. ఇప్పుడు రైతులు పడుతున్న బాధలు తీరాలంటే ధరణి 2020 చట్టాన్ని తక్షణమే రద్దుచేసి, కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో అమలులో వున్న ఆర్‌.ఓ.ఆర్‌. చట్టాన్ని తీసుకురావాలి. ఇంతకంటే వేరే మార్గం లేదు. అప్పుడే ధరణి అనే కంప్యూటరు తెచ్చిన అన్ని బాధలకు విముక్తి. భూమి శిస్తు ఏనాడో రద్దయిన దృష్ట్యా ఒకసారి రిజిష్టరు దస్తావేజుల ద్వారా వ్యవసాయ భూమి బదలా యింపు జరిగిన పక్షంలో మళ్ళీ రెవిన్యూ చట్టం కింద టైటిల్‌ డీడ్‌ ఇవ్వవలసిన అవసరం ఎంతమాత్రము లేదు. అట్లా ఇచ్చే రెవిన్యూ టైటిల్‌ డీడ్‌ మనిషి చేతికి ఆరోవేలు వంటిది.
– కె.పి.సత్యనారాయణరావు
9885411833