ఆలయల్లో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ  – నిజామాబాద్
జిల్లా కేంద్రంలో అయోధ్య రామ మందిరం బలరాముని ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ కాలనీ శ్రీ సాయి కేసరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. నేడు చారిత్రక ఘట్టం. దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని   రోజు. దేశ హిందూవులు అందరి కలలు కన్న రోజు. ఈరోజు దేశం మొత్తం ఏ వీధిర చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా అంతా ఆ శ్రీరాముని పండుగ వాతావరణం కోలాహాలంగా కనబడుతోందని అన్నారు.  ఈరోజు భక్తులందరూ శ్రీరామనామం భక్తి శ్రద్దలతో స్మరించాలన్నారు.   శ్రీరాముని  ఆశీస్సులతో  దేశ ప్రజలందరూ  చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.