గురుకులాల ప్రవేశానికి దరఖాస్తులు నేడే చివరి తేదీ

 నవతెలంగాణ – రామారెడ్డి
తెలంగాణ గురుకులాల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులకు నేడు చివరి తేదీ అని ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ  బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఎం సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు, గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, ఫిబ్రవరి 11న జరిగే అర్హత పరీక్షల్లో పాల్గొనాలని సూచించారు.