నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని చింతలూరు గ్రామంలో ప్రతి ఇంటికి సీతారాముల చిత్రపటాన్ని పంపిణీ చేసినట్లు కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వారిని పురస్కరించుకొని చింతలూరు గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రఘువీర్ గౌడ్ బాలకృష్ణ లింబాద్రి చింటూ ఈ నలుగురు కలిసి ప్రతి ఇంటికి సీతారాముల చిత్రపటాన్ని అందజేయాలన్న ఆలోచనతో సోమవారం ప్రతి ఇంటికి సీతారాముల చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొలిప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ జలంధర్ ,ప్రసాద్ ,తిరుపతిరెడ్డి, అభిలాష్, చిన్నారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.