‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి బ్లాక్ బస్టర్ హర్రర్ సినిమాల తర్వాత దర్శకుడు పన్నా రాయల్ రూపొందించిన మరో హర్రర్ అండ్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ, ‘ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమాలోని యూనిక్ పాయింట్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది. ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారంటీ. ఆడియన్స్‌ని థ్రిల్ చేసేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఓ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. మా నిర్మాత హేసన్ పాషా ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాని నిర్మించారు’ అని అన్నారు. ‘మా దర్శకుడు పన్నా రాయల్ ఈ చిత్ర కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. పన్నా టేకింగ్, ఫుటేజ్ చూసిన తర్వాత నా నమ్మకం రెట్టింపు అయ్యింది’ అని నిర్మాత హేసన్ పాషా చెప్పారు.